
384views
బీజీంగ్: చైనాలో ఐఫోన్ ఫ్యాక్టరీ ఉద్యోగులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నిరసనలు తెలుపుతున్న ఉద్యోగులపై దాడి చేస్తున్న దృశ్యాలు బుధవారం వెలుగులోకి వచ్చాయి. ఒప్పంద ఉల్లంఘనపై వేలాది మంది ఉద్యోగులు మాస్కులు ధరించి శాంతియుత నిరసనలు తెలియజేస్తున్నారు. నెల క్రితం వచ్చిన తమను అసలు బయటకు అనుమతించడం లేదని, పైగా చేసిన పనికి డబ్బులు కూడా చెల్లించడం లేదని ఆందోళనబాట పట్టారు. గత నెలలో జెంగ్ఝౌలో యాపిల్ తయారీ ప్రధాన భాగస్వామి అయిన ఫాక్స్‌కాన్‌కు చెందిన ఫ్యాక్టరీని వదిలి ఇంటికి వెళ్ళిపోయిన వారిస్థానంలో కొత్త కాంట్రాక్ట్‌తో ఉద్యోగాల్లో చేరినవారు తాజాగా నిరసనలు చేస్తున్నారు.





