217
ఆత్రేయపురం: కార్తిక వనసమారాధన లో తేనెటీగలు దాడి చేయడంతో పలువురు గాయపడ్డారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో ఆలపాటి వారి తోటలో ఓ కుటుంబం వనసమారాధన జరుపుకోవడానికి తోటకు వచ్చారు. ఈ సమయంలో చెట్టుపై ఉన్న తేనెటీగలు చెలరేగాయి. దీంతో అక్కడ ఆటపాటలతో పాటుగా.. వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్న 25 మందిపై తేనెటీగలు దాడి చేశాయి. ఒక్కసారిగా జరిగిన హఠాత్పారిణామంతో వారంతా హాహాకారాలు చేసుకుంటూ పరుగులు తీశారు. వారిలో 10 మంది వరకు అపస్మారక స్థితికి చేరుకోవడంతో రావులపాలెం ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఆలపాటి సత్యవతి, కృష్ణకుమారిల పరిస్థితి ఆందోళన కరంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందజేస్తున్నట్టు వైద్యులు తెలిపారు.