
332views
విజయవాడ: తన ఓటు బ్యాంకు కాపాడుకోవడం కోసం జగన్ ప్రభుత్వం మత రాజకీయాలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజలు కట్టిన పన్నులతో చర్చిల కోసం 175 కోట్ల రూపాయలు కేటాయించడాన్ని బీజేపీ ఖండిస్తోందని అన్నారు. ఇప్పటికే ఫాస్టర్లకు నెల జీతాలను ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లిస్తున్నారని ఇది మతమార్పిడులను ప్రోత్సహించేలా ఉందన్నారు.





