163
న్యూఢిల్లీ: దాదాపు రెండేళ్ల తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌లు ఒకరినొకరు పలకరించుకున్నారు. ఇండోనేషియాలో జరుగుతోన్న జీ-20 సదస్సులో భాగంగా మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం దీనికి వేదికైంది. ఈ సందర్భంగా ఒకరికొకరు ఎదురుపడిన నేతలు.. పరస్పరం చేతులు కలిపి, ముచ్చటించారు. జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ సంభాషిస్తున్నట్టు వీడియోలు బయటకు వచ్చాయి. వాస్తవానికి.. జీ-20 సదస్సు క్రమంలో ఈ ఇద్దరు నేతల మధ్య భేటీ జరిగే అవకాశంపై వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పటివరకు ఏ సమావేశం ఖరారు కాలేదని తెలుస్తోంది.