188
నెల్లూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలోని కావలి, ఉదయగిరి నియోజకవర్గం నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జలదంకి, కావలి తుమ్మలపెంట ప్రధాన రహదారిపై వాగులు పొంగి పొర్లుతుండడంతో వాహన రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. కావలి పట్టణంలోని వైకుంఠపురం, జనతా పేట, బాలకృష్ణ రెడ్డి నగర్, పలు ప్రాంతాల్లోని నివాసాలకి వర్షపు నీరు చేరి స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మండల పరిధిలోని బుడమ గుంట గ్రామ సమీపంలోని జగనన్న కాలనీలకు వెళ్ళే ప్రాంతమంతా చెరువును తలపిస్తోంది.