News

ఇన్‌స్టాగ్రామ్‌ మూగది … ట్విట్టర్ ఉత్తమం

163views

ముంబై: ఇన్ స్టాగ్రామ్ మూగదని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటిదాకా ట్విట్టర్‌ను ఉత్తమ సోషల్ మీడియాగా చెప్పుకొచ్చిన కంగనా… ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ మూగది అంటూ షాకింగ్‌ కామెంట్లు చేసింది.

ఇన్ స్టా అంతా ఫొటోల మయమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అంతేకాదు ట్విట్టర్ ను ఉత్తమ సోషల్ మీడియా వేదికగానూ ఆమె అభివర్ణించింది. మేధోపరంగా, సైద్ధాంతికంగా ప్రేరేపించేదంటూ ఆమె పేర్కొన్నారు. ‘ఇన్‌స్టాగ్రామ్‌ ఒక మూగది. ఇందులో ఫొటోలు తప్ప ఏమీ ఉండవు. ఎవరైనా ఏదైనా అభిప్రాయం రాసినా అది మరుసటి రోజుకు మాయమైపోతుంది. కొందరు ఉంటారు. వారు చెప్పేదానికి ఎలాంటి అర్థం ఉండదు. వారి సందేశం అదృశ్యమైనా వారేం పట్టించుకోరు. కానీ మాలాంటి వారి పరిస్థితి ఏంటి..?’ అంటూ ఆమె ప్రశ్నించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి