News

ఏక్‌నాథ్‌ శిందే వర్గంలోకి విశ్వనాథ్‌ రాజ్‌పుత్‌

337views

ముంబాయి: విధాన పరిషత్‌లో ప్రతిపక్ష నేత అంబాదాస్‌ దానవేకు అత్యంత సన్నిహితుడు, ఉద్ధవ్‌ ఠాక్రేకు నమ్మకమైన కార్యకర్త విశ్వనాథ్‌ రాజ్‌పుత్‌ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే వర్గంలో చేరారు. శిందే వర్గంలో చేరిన వారిలో ఔరంగాబాద్‌కు చెందిన విశ్వనాథ్‌తోపాటు ఎమ్మెన్నెస్, ఉద్ధవ్‌ వర్గానికి చెందిన పలువురు సీనియర్‌ పదాధికారులు, కార్యకర్తలు ఉన్నారు. వీరందరికీ గురువారం ముంబైలో శిందే స్వాగతం పలికారు.

కాగా విశ్వనాథ్‌ చేరికతో ఉద్ధవ్‌ ఠాక్రే వర్గానికి గట్టిదెబ్బ తగిలినట్టయింది. త్వరలో ఔరంగాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్, ఇతర స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ కీలక కార్యకర్తగా పేరున్న విశ్వనాథ్‌ ఆకస్మాత్తుగా శిందే వర్గంలో చేరడం జీర్ణించుకోలేక పోతున్నారు. విశ్వనాథ్‌తోపాటు ఎమ్మెన్నెస్‌ విద్యార్ధి సేన మాజీ జిల్లా అధ్యక్షుడు అమోల్‌ ఖడ్సే, మరికొందరు ఉద్ధవ్‌ వర్గం కార్యకర్తలు శిందే వర్గంలో చేరారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి