
302views
తిరుపతి: లడ్డూ ప్రసాదం తయారీ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)తో పాటు రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు సరఫరా చేసే రైతులకు కనీస మద్దతు ధర కంటే 10 శాతం అదనంగా ప్రీమియం ధర దక్కేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఎంపికచేసిన 100 మంది రైతులతో శుక్రవారం (ఈ నెల 4వ తేదీ) తిరుమలలోని శ్వేతభవన్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. లడ్డూ తయారీకి ఇప్పటికే ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండిస్తున్న శనగలను టీటీడీకి సరఫరా చేస్తున్న రైతుసాధికార సంస్థ టీటీడీతో పాటు 11 ఆలయాలకు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు సరఫరా చేయనుంది.





