News

ప్రధాన రవాణా విమానాల ఉత్పత్తిదారునిగా భారత్

345views

వడోదర: భారతదేశం ఇప్పుడు రవాణా విమానాల ఉత్పత్తిలో ప్రధాన దేశంగా మారుతుందని, భారత వైమానిక దళం కోసం సి-295 మీడియం రవాణా విమానాల తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. తమ ప్రభుత్వ విధానాలు “స్థిరంగా, ఊహాజనితంగా, భవిష్యత్తుకు అనుగుణంగా” ఉన్నందున తయారీ రంగంతో సహా భారతదేశం వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తోందని ప్రధాని చెప్పారు.

మన దేశంలో ప్రైవేటు రంగంలో తొలి విమానాల తయారీ కర్మాగారానికి ప్రధాని ఆదివారం గుజరాత్‌లోని వడోదరలో శంకుస్థాపన చేశారు. టాటా-ఎయిర్‌బస్ కన్సార్షియం దీనిని ఏర్పాటు చేస్తోంది. స్వయం సమృద్ధ భారత దేశం (ఆత్మనిర్భర్ భారత్) దిశగా ఇది మరొక ముందడుగు అని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి.

త్వరలో మేకిన్ ఇండియా ట్యాగ్ తో తయారు చేయబడిన విమానాలు అందుబాటులోకి వస్తాయని ఈ సందర్భంగా ప్రధాని చెప్పారు. గుజరాత్ లో తయారు చేయబడే విమానాలు సైన్యానికి కొత్త శక్తిని అందించడమే కాకుండా, విమానాల తయారీలో కొత్త నిర్మాణ వ్యవస్థను కూడా అభివృద్ధి చేస్తాయని పేర్కొన్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి