News

గాంధీపై ఏపీ ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్​ విక్టర్ ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు… బ్రాహ్మణ, ఆర్యవైశ్య సంఘాల ఆందోళన

344views

ఒంగోలు: మహాత్మాగాంధీపై ఏపీ ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్ విక్టర్ ప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ.. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కుల మతాలకు అతీతుడైన జాతిపితపై ఇలాంటి మాటలు తగదన్నారు. యావత్ ప్రజానీకానికీ విక్టర్ ప్రసాద్ భేషరతుగా క్షమాపణలు చెప్పి ఆయన పదవికి రాజీనామా చేయాలన్నారు. గిద్దలూరు పట్టణంలోని ఆర్యవైశ్యులు గాంధీబొమ్మ సెంటర్​లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహనికి క్షీరాభిషేకం చేశారు. మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విక్టర్ ప్రసాద్​ను వెంటనే పదవి నుంచి తొలగించాలని, ప్లకార్డు​లతో పట్టణంలో ర్యాలీ నిర్వహించి.. మండల తహశీల్దార్ రాజా రమేష్ ప్రేమ్ కుమార్​కు వినతి పత్రం అందించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి