News

దీపావళి జరపొద్దంటూ పూజను కాలితో తన్నిన మహిళ.. కేసు నమోదు!

268views

భాగ్యనగరం: దీపావళి సందర్భంగా అపార్ట్మెంట్లోని తమ ఇంటి ముందు దీపాలు పెట్టుకుని, పూజలు చేస్తుంటే, ఎదురుగా నివాసముంటున్న ఓ కుటుంబం ఆ హిందూ కుటుంబంపై చెప్పుతో దాడి చేసేందుకు ప్రయత్నించింది. తాము కాకర్లు కాల్చలేదని, కేవలం దీపాలు వెలుగించుకున్నామని ప్రాధేయపడినా ఎదురు కుటుంబీకులు కనికరించలేదు.

దీపాలను, సాక్షాత్తూ లక్ష్మీదేవి ప్రతిరూపమైన ముగ్గును కాళ్ళతో తన్ని ధ్వంసం చేశారు. ఈ పరిణామానికి నిశ్చేష్టులైన హిందూ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. నిందితులపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన తెలుసుకున్న విశ్వహిందూ పరిషత్‌, భజరంగ దళ్‌ ప్రతినిధులు, కార్యకర్తలు ఘటన స్థలానికి హుటాహుటిన చేరుకుని బాధిత హిందూ కుటుంబానికి మేమున్నామంటూ భరోసా కల్పించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి