
న్యూఢిల్లీ: బీమా సేవల పరిధిని మరింత విస్తృతం చేసి, ఎక్కువ మంది ప్రజలకు అందుబాటులోకి రావడం కోసం వీటికి సంబంధించిన అన్ని సేవలను ఒకేచోట అందించడానికి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవెలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) బీమా సుగమ్ పేరుతో ఒక ప్లాట్‌ఫారమ్‌ను అందుబాటులోకి తేనుంది.
వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ పోర్టల్ మొదలవుతుంది. దీనివల్ల ఇన్సూరెన్స్ మార్కెట్ పూర్తిగా డిజిటైజ్ అవుతుందని, పాలసీదారులకు మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పోర్టల్ద్వారా అన్ని కంపెనీల పాలసీలను కొనుక్కోవచ్చు. ఇతర సేవలను పొందవచ్చు.
లైఫ్, నాన్–లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులో ఉంటాయి. కంపెనీల నుంచి కోట్స్ పొందవచ్చు. పాలసీ సేవలతోపాటు పాలసీ వివరాలను భద్రపరచడం, క్లెయిమ్స్సెటిల్ చేయడం, బీమా ఏజెంట్లను మార్చుకోవడం వంటి పనులకు బీమా సుగమ్ పోర్టల్‌ను వాడుకోవచ్చు.
Source: Nijamtoday




