News

యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలి

405views

దుత్తలూరు: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఇక్కడి విశ్వ భారతి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో, రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో నెల్లూరు జిల్లా, దుత్తలూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో రక్తదాన శిబిరం జరిగింది. ఈ శిబిరంలో ఎంపీడీఓ సాయి ప్రసాద్, యస్సై బాజిరెడ్డిలు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత ముందుకు వచ్చి రక్తదానం చేయడం మంచిదన్నారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న ఇతరుల ప్రాణాలను కాపాడుకోవచ్చున్నారు. రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి, గర్భిణులు, రక్త కణాలు తగ్గిన వారికి ఆపద సమయంలో ఉపయోగ పడుతుందని చెప్పారు. ఈ శిబిరంలో యువత ఉత్సాహంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. విశ్వ భారతి సేవా సంస్థ అధ్యక్షులు పుల్లారెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ మోటివేటర్ భాస్కర్ రావు, సాయి రామ్, సభ్యులు లక్ష్మీ ప్రసన్న, శ్రీనివాసరావు, మల్లిఖార్జున, విశ్వభారతి సంస్థ సభ్యులు కృష్ణ, రామయ్య, రాజా, కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి