News

ఏపీలో నైపుణ్య కళాశాల

368views

విజయవాడ: డిగ్రీ, ఇంజినీరింగ్‌ పట్టాపుచ్చుకొని బయటికి వస్తున్న వారికి ఉచిత శిక్షణతో పాటు ఉపాధిబాట చూపించేందుకు నైపుణ్య కళాశాలల్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా.. విశాఖలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ మారిటైమ్‌ అండ్‌ షిప్‌ బిల్డింగ్‌ (సెమ్స్‌) సంస్థని నైపుణ్య కళాశాలగా ప్రభుత్వం గుర్తించింది. ఇందులో ఇంజినీరింగ్‌ విద్యార్థులకు తొలివిడతగా 3 కోర్సుల్ని ప్రారంభించనున్నారు. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశలో రెండు ప్రాంతాల్లో సెమ్స్‌ను ఏర్పాటు చేసింది.

ఒకటి ముంబైలో ఉండగా.. మరొకటి విశాఖపట్నంలో నెలకొల్పారు. క్లాస్‌ రూంలో పాఠ్యాంశాలు చదివిన విద్యార్థులకు సెమ్స్‌ ద్వారా ప్రాక్టికల్స్‌లో శిక్షణ అందించనున్నారు. బీఈ, బీటెక్‌ (మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్‌) ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు శిక్షణ అందించేందుకు తొలివిడతగా మూడు స్కిల్‌ కోర్సుల్ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి