News

కొచ్చి విమానాశ్రయంలో బంగారం ప‌ట్టివేత‌

348views

కొచ్చి: కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో మలద్వారంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తిని అధికారులు అరెస్టు చేశారు. నిందితుడు బంగారాన్ని నాలుగు క్యాప్సుల్స్​లో నింపి.. మలద్వారంలో దాచుకొని తరలిస్తున్నట్టు అధికారులు గుర్తించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. కొజికోడ్​ జిల్లాకు చెందిన కొడువాలి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవలే దోహ వెళ్లాడు. అక్కడ నుంచి ఇండిగో ఫ్లైట్​లో బుధవారం కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఆ సమయంలో అతడిపై అధికారులకు అనుమానం వచ్చింది. అదుపులోకి తీసుకుని సోదాలు చేపట్టారు. మలద్వారంలో నాలుగు క్యాప్సుల్స్​ రూపంలో​ బంగారం తరలిస్తున్నట్లు గుర్తించారు. సుమారు 1066.75 గ్రాముల బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు యత్నించాడని కస్టమ్స్​ అధికారులు తెలిపారు.

ముంబయిలో …

మహారాష్ట్రలోని ముంబయిలో నాలుగు వేర్వేరు ఘటనల్లో సుమారు 15 కేజీల బంగారాన్ని కస్టమ్స్​ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్టోబరు 11,12 తేదీల్లో చేపట్టిన సోదాల్లో సీజ్​ చేసి బంగారం సుమారు 7.87 కోట్ల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు. మరో రెండు ఘటనలో రూ.22 లక్షలు విలువైన విదేశీ కరెన్సీని సీజ్​ చేశారు. ఈ ఘటన ఏడుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి