భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్… ప్రకటించిన భారత ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్

419views
న్యూఢిల్లీ: భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు జస్టిస్ చంద్రచూడ్. ఈ మేరకు ఆయన పేరును ప్రతిపాదిస్తూ లేఖను అందించారు ప్రస్తుత సీజేఐ జస్టిస్ యూయూ లలిత్. మంగళవారం ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు లాంజ్‌లో న్యాయమూర్తుల సమక్షంలో అందించారు లలిత్. నవంబర్ 8న జస్టిస్ లలిత్ పదవీ విరమణ చేసిన తర్వాత నవంబర్ 9న తదుపరి సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ బాధ్యతలు చేపట్టనున్నారు. 2024 నవంబరు 10 వరకు ఆ పదవిలో కొనసాగుతారు. 44 ఏళ్ళ కిందట ఈయన తండ్రి జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి 7 ఏళ్ల 5 నెలలపాటు ఆ పదవిలో కొనసాగారు. సుదీర్ఘకాలం కొనసాగిన సీజేఐగా రికార్డు సృష్టించారు.





