
443views
న్యూఢిల్లీ: గత తొమ్మిది నెలల వ్యవధిలో పాకిస్తాన్‌లో భారత్‌కు చెందిన ఆరుగురు ఖైదీలు మృతి చెందడం ఆందోళనకరమని కేంద్రం పేర్కొంది. మృతుల్లో ఐదుగురు మత్స్యకారులే ఉన్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి అన్నారు.
ఈ అంశాన్ని పాకిస్తాన్ వద్ద లేవనెత్తినట్టు వెల్లడించారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అయితే, వీరంతా పాకిస్తాన్‌లో శిక్షను పూర్తి చేసుకున్నవారేనని తెలిపారు. ఈ పరిస్థితి తీవ్ర ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌లో ఉన్న భారతీయ ఖైదీలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఆ దేశానిదేనని గుర్తుచేశారు. అలాగే, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఇటీవల పాకిస్తాన్ యూఎస్ రాయబారి డొనాల్డ్ బ్లోమే పర్యటనపై అభ్యంతరాలను అమెరికాకు తెలిపామన్నారు. పీవోకేలో ఆయన సమావేశాలు నిర్వహించడం పట్ల కూడా అభ్యంతరం చెప్పినట్టు చెప్పారు.





