195
-
త్వరలో రైల్వే జోన్‌కు శంకుస్థాపన
-
బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రైల్వే జోన్ శంకుస్థాపన త్వరలోనే జరుగుతుందని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎమ్మెల్సీ పి.వి.ఎన్ మాధవ్ తెలిపారు. జోన్ ఏర్పాటుపై దుష్ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. జోన్ ఏర్పాటు లేకపోతే, నిధులు ఎందుకు కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు. నిరాధారమైన లీక్ల ఆధారంగా ఆవాస్తవ కథనాలు వస్తున్నాయని ఆవేదనవ్యక్తం చేశారు. ఇదే అంశాన్ని రైల్వేమంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళామని తెలిపారు.
విశాఖలో 25 ఏకరాల స్థలాన్ని దక్షిణ కోస్తా రైల్వేకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరితే ఇప్పటి వరకు స్పందించలేదని మాధవ్ ఆరోపించారు. 2020-21 బడ్జెట్ లో రూ. 175 కోట్లు ప్రత్యేక రైల్వే జోన్ కోసం ఇచ్చామన్నారు. ర్యాక్ సమస్య వల్ల కొత్త రైలు మొదలుకావడం ఆలస్యమైందని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు.