News

అట్టహాసంగా ప్రారంభమైన 36వ జాతీయ క్రీడా వేడుకలు

332views

అహ్మదాబాద్‌: ఏడేళ్ళ‌ నిరీక్షణ ముగిసిన వేళ.. కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతుల్లో.. బాణ‌సంచా వెలుగుల్లో.. చూపు తిప్పుకోనివ్వని నృత్యకారుల ప్రదర్శన మధ్యలో.. మనసును మైమరిపించే సంగీత మాయలో.. 36వ జాతీయ క్రీడలు అట్టహాసంగా ఆరంభమయ్యాయి.

భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై ఈ క్రీడలను అధికారికంగా ప్రారంభించారు. ప్రపంచంలోనే పెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో36వ జాతీయ క్రీడలు ఆరంభోత్సవ వేడుక కనుల పండుగగా జరిగింది.

ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై ఈ క్రీడలను అధికారికంగా ప్రారంభించారు. సంగీత విభావరితో మొదలైన కార్యక్రమం ఆద్యంతం అలరించింది. శంకర్‌ మహాదేవన్‌ తదితర గాయకుల పాటలకు అనుగుణంగా స్టాండ్స్‌లోని ప్రేక్షకులు స్టెప్పులతో స్టేడియాన్ని హోరెత్తించారు. పాఠశాల, కళాశాల విద్యార్థులతో పాటు ఇతర జనాలతో స్టేడియం దాదాపుగా నిండిపోయినట్లే కనిపించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి