
61views
జమ్ముకశ్మీర్: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. ఇక్కడ గల రెండు జిల్లాల్లో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. షోపియాన్ జిల్లా చిత్రగామ్, బారాముల్లా జిల్లాలోని పఠాన్‌లో తెల్లవారుజామున నుంచి కాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారాంతో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. రెండు ప్రాంతాల్లో ఆపరేషన్ కొనసాగుతున్నదని కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు.