News

నెల్లూరులో ఘ‌నంగా భీమ‌న్న‌, జాషువాల జ‌యంతి

196views

నెల్లూరు: సామాజిక సమరసతావేదిక ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోవెంగళరావునగర్‌లోని కార్పొరేషన్ హైస్కూలు (తాతయ్యబడి)లో కళాప్రపూర్ణ బోయి భీమన్న, కవికోకిల గుర్రం జాషువాల జయంతి సందర్భంగా సాహితీ సప్తాహకార్యక్రమం శుక్ర‌వారం ఘ‌నంగా జ‌రిగింది.

రిటైర్డు బ్యాంకు ఆఫీసర్ భాస్కరరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో కోడూరు సత్యం, హర్షవర్ధిని, సమరసతావేదిక జిల్లా మహిళా ప్రముఖ్, న్యాయవాది రమాదేవి, రిటైర్డ్ బ్యాంకు అధికారి భాస్కరయ్య, ప్రధానోపాధ్యాయుడు గోపాలరాజు, తెలుగు పండితుడు శ్రీనివాస్, ఉపాధ్యాయుడు నాగరాజు, భాస్కరరెడ్డి, సుబ్రహ్మణ్యం పాల్గొని, మాట్లాడారు.

విద్యార్థినీవిద్యార్థులు జాషువా ర‌చించిన పద్యాలను మధురంగా గానం చేశారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు వచ్చిన విజేతలకు జాషువా చిత్రంతోకూడిన బ‌హుమ‌తులు, ప్ర‌శంసా ప‌త్రాలు ప్ర‌దానం చేశారు. కార్య‌క్ర‌మంలో సుమారు 60 విద్యార్థినీవిద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి