News

‘సబ్ కా సాత్…సబ్ కా వికాస్’ పుస్తకం ఆవిష్క‌ర‌ణ‌

214views

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అన్ని పక్షాల రాజకీయ నాయకులను తరచుగా భేటీ అవ్వాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అలా చేస్తేనే ప్రతిపక్ష పార్టీలు.. ఆయన విధానాలపై ఉన్న అపార్థాలను తొలగించుకునేందుకు సహాయపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ ప్రసంగాల్లో ఎంపిక చేసిన కొన్నింటిని ‘సబ్ కా సాత్..సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్’ పేరుతో రూపొందించిన పుస్తకాన్ని ఆయన ఢిల్లీలో విడుదల చేశారు.

ఆరోగ్య సంరక్షణ, విదేశాంగ విధానం, సాంకేతికత వంటి విభిన్న రంగాలలో భారత్​ సాధించిన విజయాల పట్ల ప్రధాని మోదీని వెంకయ్య ప్రశంసించారు. భారత్​ ఎదుగుదలను ప్రపంచం ఇప్పుడు గుర్తిస్తుందని అన్నారు. మోదీ నూతన సంస్కరణలు చేపట్టారని.. ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకువచ్చారని వెంకయ్య కొనియాడారు. అదే సమయంలో, రాజకీయ పార్టీలు కూడా విశాల దృక్పథంతో ఉండాలని, అధికారంలో ఉన్నవారికి మీరు శత్రువులు కాదని కేవలం ప్రత్యర్థులేనని చెప్పారు. అన్ని పార్టీలు పరస్పరం గౌరవించుకోవాలని హితవు పలికారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి