News

పంజాబ్‌లో పెచ్చుమీరుతున్న గ్యాంగ్ స్టార్లు

69views
  • రౌడీ ముఠాల్లో చేరాలంటూ ఆన్‌లైన్ ప్రకటనలు

చండీగఢ్: పంజాబ్‌లో గ్యాంగ్‌స్టర్ల ఆగడాలు రోజు రోజుకూ మితిమీరిపోతున్నాయి. బరితెగించి ప్రవర్తిస్తున్నారు. తాజాగా తమ గ్యాంగ్‌లో చేరాలనుకునే వారు ఫలానా వాట్సాప్‌ నెంబర్‌కు మెసేజ్‌ చేయాల్సిందిగా.. ఆ నెంబర్‌ను జత చేస్తూ ఫేస్‌బుక్‌లో ప్రకటన ఇచ్చారు.

ప్రస్తుతం ఈ ప్రకటన వైరల్‌గా మారింది. దీనిని దేవేందర్‌ బాంబిహా పేరిట బాంబిహా గ్యాంగ్‌స్టర్‌ గ్రూపు క్రియేట్‌ చేసినట్టు అధికారులు చెబుతున్నారు.
ఇటీవల పంజాబ్‌లో ప్రముఖ గాయకుడు, కాంగ్రెస్‌ నేత సిద్ధూ మూసేవాలా హత్య అనంతరం పలువురు గ్యాంగ్‌స్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పంజాబ్‌లో ప్రధాన గ్యాంగ్‌స్టర్‌ గ్రూపులైన లారెన్స్‌ బిష్ణోయ్‌, బాంబిహాలకు చెందిన వారు పరస్పరం సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు గుప్పించుకున్నారు.

ఈ క్రమంలో లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్రూప్‌నకు చెందినట్టుగా భావిస్తున్న సందీప్‌ బిష్ణోయ్‌ను రాజస్థాన్‌లోని నాగౌర్‌ కోర్టుకు తరలిస్తుండగా బైక్‌పై వచ్చి కొందరు హత్య చేశారు. దీనికి తామే కారణమని బాంబిహా గ్రూప్‌ ప్రకటించుకుంది. దీంతో ప్రత్యర్థులను మట్టుబెట్టేందుకు లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్రూప్‌ సరైన సమయం కోసం వేచిచూస్తున్నట్టు బాంబిహా గ్రూప్‌నకు పక్కా సమాచారం ఉంది. ఈ క్రమంలో బాంబిహా గ్రూప్‌ ఫేస్‌బుక్‌లో ప్రకటన చేయడం గమనార్హం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి