
355views
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ చరిత్ర సృష్టించింది. ప్రతిష్ఠాత్మక ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా రికార్డులకెక్కింది. బుధవారం ఆమె బెల్‌గ్రేడ్ ఛాంపియన్‌షిప్స్‌లో 53 కేజీల విభాగంలో కాంస్యం సాధించింది. కాంస్య పతక ప్లేఆఫ్‌లో వినేశ్ 8-0తో స్వీడన్‌కు చెందిన ఎమ్మా జోనా మాల్‌గ్రెన్‌పై గెలిచింది. క్వాలిఫికేషన్‌లో బత్కుయాగ్ (మంగోలియా) చేతిలో ఓడిన వినేశ్.. పుంజుకున్న తీరు అద్భుతం. బత్కుయాగ్ ఫైనల్ చేరడంతో రెపిచేజ్ రౌండ్‌కు అర్హత సాధించిన వినేశ్ మొదట కజకిస్థాన్‌కు చెందిన ఎషిమోవాను 4-0తో ఓడించింది.





