News

పెట్రోలింగ్‌ పాయింట్‌-15 నుంచి వెనక్కి మళ్ళిన భారత్‌, చైనా బలగాలు

185views

తూర్పు లడ్డాఖ్ ‌లోని గోగ్రా-హాట్ ‌స్ప్రింగ్స్ ‌లో వివాదానికి కేంద్రబిందువుగా ఉన్న పెట్రోలింగ్‌ పాయింట్‌ (పీపీ)-15 నుంచి భారత్‌, చైనా బలగాలు సోమవారం వెనక్కి మళ్లాయి. అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక, మౌలిక వసతులను తొలగించాయి. నిర్దేశిత ప్రణాళిక ప్రకారమే రెండు పక్షాలూ ఈ ప్రక్రియను చేపట్టాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. పీపీ-15 నుంచి రెండు దేశాల సైనికుల ఉపసంహరణ జరిగినప్పటికీ డెమ్ ‌చోక్‌, దెప్సాంగ్‌ ప్రాంతాల్లో వివాదాలను పరిష్కరించుకునే అంశంలో ఎలాంటి పురోగతి లేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.