NewsProgramms

కౌశల్ 2022 రాష్ట్రస్థాయి సైన్స్ ప్రతిభాన్వేషణ పోటీలు

379views

* పోస్టర్ ఆవిష్కరించిన ఎన్ ఎస్ టి ఎల్ ( NSTL) డైరెక్టర్ డాక్టర్ వై శ్రీనివాసరావు

భారతీయ విజ్ఞాన మండలి ( BVM ), ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి ( APCOST ) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్న
కౌశల్ – 2022 రాష్ట్రస్థాయి సైన్స్ ప్రతిభాన్వేషణ పోటీ గోడపత్రికలను ఎన్ ఎస్ టి ఎల్ డైరెక్టర్ శ్రీ యలమంచిలి శ్రీనివాసరావు గారు ఆవిష్కరించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం 2018 లో ప్రారంభించిన ఈ కార్యక్రమానికి తొలుతనుంచి ఎన్ ఎస్ టి ఎల్ ఇతోధిక సహకారము అందిస్తున్నదని ఆయన తెలిపారు. విద్యార్థులలో విజ్ఞాన శాస్త్ర అవగాహన పెంపొందించి వారిలో పరిశోధనా ఆసక్తిని పెంపొందించే ఉద్దేశంతో , అదే విధంగా భారతీయ ప్రాచీన విజ్ఞానము మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్రాలలో భారతీయ శాస్త్రవేత్తలు చేసిన చేస్తున్న కృషిని తెలియచెప్పే ఉద్దేశముతో ఈ కౌశల్ కార్యక్రమం నిర్వహించబడుతున్నదని వారు తెలిపారు.

కౌశల్ సైన్స్ క్విజ్ పోటీలో పాల్గొనుటకు నియమ నిబంధనలు :

8,9,10 తరగతుల విద్యార్థులతో క్విజ్ టీమ్ ఏర్పడాలి. ఇందుకోసం ఆన్ లైన్ లో ఫ్రాథమిక పరీక్ష వ్రాసి అర్హత పొందాలి. ఇది కేవలం ప్రభుత్వరంగ పాఠశాలల విద్యారులకు మాత్రమే కనుక రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ పరీక్ష వ్రాసే అవకాశం సద్వినియోగం చేసుకోవాలి.

సిలబస్ :

8,9,10 తరగతుల గణితము, సైన్స్ మరియు “విజ్ఞాన శాస్త్ర రంగంలో భారతీయుల కృషి” మెటీరియల్.

బహుమతులు ప్రశంసా పత్రం, జ్ఞాపిక మరియు నగదు

జిల్లా స్థాయి విజేతలకు :

ప్రధమ బహుమతి రూ.7.500/
ద్వితీయ బహుమతి రూ.6,000/
తృతీయ బహుమతి రూ.4,500/

రాష్ట్ర స్థాయి :

ప్రధమ బహుమతి రూ. 15,000/
ద్వితీయ బహుమతి రూ. 12,000/
తృతీయ బహుమతి : రూ.9,000/

రాష్ట్ర స్థాయిలో కన్సొలేషన్ బహుమతులు రూ.6,000/-

పాఠశాల కో-ఆర్డినేటర్లు

ది. 15-10-2022 లోపు విద్యార్థుల పేర్లను www.bvmap.org లో నమోదు చేసుకొనవలెను.

పోస్టర్ కాంపిటీషన్ :

జనరల్ థీమ్ మరియు స్వాతంత్య్ర అమృత మహోత్సవాల థీమ్ 8 మరియు 9 తరగతుల నుండి ఇద్దరు (రెండు ప్రెజంటేషన్లు) ఒక పాఠశాల నుండి అనుమతించబడును .

బహుమతులు: సర్టిఫికేట్, జ్ఞాపిక మరియు నగదు

రిజిస్ట్రేషన్ కి చివరి తేది 15 అక్టోబర్ 2022

ప్రాధమిక స్థాయి ఆన్లైన్ పరీక్ష : 2,3 నవంబర్ 2022 లలో పాఠశాలలో

జిల్లా స్థాయి పోటీలు : 26 నవంబర్ 2022

రాష్ట్ర స్థాయి పోటీలు : 9 డిసెంబర్ 2022

రాష్ట్ర స్థాయి విజేతలకు బహుమతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ గవర్నర్ గారి ద్వారా అందజేయబడును.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.