
గుజరాత్: ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కృష్ణ హింగ్ తయారీదారు కార్యాలయాలు, దాని యజమాని అస్మా ఖాన్ పఠాన్ ఇంటిపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్.ఐ.ఏ) దాడులు చేసింది. ఈ నెల అయిదోతేదీన ఎన్.ఐ.ఏ గుజరాత్‌లోని నాడియాడ్, ఖేడా జిల్లా ఖేడాలో ఉన్న న్యూ భారత్ హింగ్ సప్లయర్స్ కార్యాలయంపై, కోట్లాది రూపాయల అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించి టెర్రర్ ఫండింగ్‌కు సంబంధించి దాడి చేసింది. ఈ కంపెనీ బాగా తెలిసిన హింగ్ బ్రాండ్ కృష్ణ హింగ్‌ను మార్కెట్ చేస్తుంది. నివేదిక ప్రకారం, సోమవారం తెల్లవారుజామున ప్రారంభమైన దాడి ఎనిమిది గంటల పాటు కొనసాగింది. మధ్యాహ్నం 3.30 గంటలకు ముగిసింది. నైడాడ్ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ సహాయంతో ఎన్.ఐ.ఏ ఈ దాడిని నిర్వహించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చేందుకు నదియాడ్ నుంచి ఢిల్లీకి నిధులు తరలించినట్టు అనుమానిత టెర్రర్ ఫండింగ్ లింక్‌పై ఎన్‌ఐఏకు ఇంటెలిజెంట్ టిప్ అందడంతో ఈ దాడి జరిగింది.
Source: OpIndia





