News

జమ్మూక‌శ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్‌… ఇద్దరు తీవ్రవాదులు హతం

112views

జమ్మూక‌శ్మీర్‌: జమ్మూ-కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక్కడి పోష్కీరిలో ముష్కరులు దాగి ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతాదళాలు ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించడంతో ఎదురుకాల్పులు జరిపినట్టు ఓ పోలీస్‌ అధికారి తెలిపారు. కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు మృతి చెందారని.. వారి వివరాలు ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి