News

మణిపూర్‌లో జేడియూ శాసనసభ పక్షం బీజేపీలో విలీనం!

425views
  • కమల తీర్థం పుచ్చుకున్న ఐదుగురు ఎమ్మెల్యేలు

  • నితీష్ కుమార్‌కు ఎదురు దెబ్బ

మణిపూర్‌: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్‌కు మణిపూర్‌లో ఎదురుదెబ్బ తగిలింది. నితీశ్​కు చెందిన జేడీయూ పార్టీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ)లో చేరారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో జేడీయూకు ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఐదుగురు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మూడింట రెండింట మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన నేపథ్యంలో.. జేడీయూ శాసనపక్షాన్ని.. బీజేపీలో విలీనం చేస్తున్నట్టు ఆ రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి కె. మేఘజిత్ సింగ్ ప్రకటించారు. వీరికి పార్టీ ఫిరాయింపులు చట్టం వర్తించదని అన్నారు. బీజేపీలో చేరినవారిలో ఎమ్మెల్యేలు కెహెచ్ జోయ్‌కిషన్, ఎన్ సనాతే, మహ్మద్ అచ్చబుద్దీన్, ఏఎం ఖౌటే, తంగ్జామ్ అరుణ్ కుమార్‌లు ఉన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి