News

చైనా డ్రోన్లపై తైవాన్ కాల్పులు!

409views

తైపీ సిటీ: తైవాన్‌, చైనా మధ్య ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. చైనా తీర ప్రాంతానికి వెలుపల తమ ఔట్‌పోస్టులపై ఎగురుతున్న డ్రాగన్‌ డ్రోన్లపై తైవాన్‌ కాల్పులు జరిపింది. కవ్వింపు చర్యలకు దిగితే.. దీటుగా బదులిస్తామనే సంకేతాలను చైనాకు పంపింది.

కిన్‌మెన్‌ ద్వీప సమూహాలపై డ్రోన్లను గుర్తించి.. కాల్పులు జరిపినట్టు తైవాన్‌ సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది. అవి మానవరహిత డ్రోన్లు అని పేర్కొంది. అయితే, డ్రోన్లకు సంబంధించి ఇతర వివరాలు వెల్లడించలేదు. తమ కాల్పుల తర్వాత డ్రాగన్‌ డ్రోన్లు.. చైనా సిటీ జియామెన్‌కు తిరిగి వెళ్ళిన‌ట్టు తైవాన్‌ సైన్యం తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి