
451views
కేరళ అంటేనే అభ్యుదయం, అత్యాధునికం అని కొన్ని పత్రికలు, వగైరాలు దశాబ్దాల తరబడి ఊదరగోట్టాయి. కానీ ఏ విషయంలో చూసుకున్నా కేరళలో వెనుకబాటే కనిపిస్తూ ఉంది.
ఇప్పుడు తాజాగా అంబులెన్స్ డోర్ ఓపెన్ కాకపోవడంతో ఒక వ్యక్తి మరణించిన ఘటన అందరినీ నివ్వెర పరుస్తోంది. కేరళలోని కోజికోడ్ లో ఈ ఘోరం జరిగింది. కోయమోన్(66) అనే వ్యక్తిని ఓ బైక్ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని వెంటనే అంబులెన్స్ లో బీచ్ ఆసుపత్రికి తరలించారు. కానీ ఆసుపత్రికి చేరుకున్నాక అంబులెన్స్ డోర్ తెరుచుకోలేదు. అరగంట శ్రమించి డోర్ పగులగొట్టి అతడిని బయటికి తీశారు. కానీ కొన ఊపిరితో నరకం అనుభవించిన కోయమోన్… అప్పటికే మరణించాడు. ఈ ఘటనపై కేరళ వైద్యశాఖ మంత్రి వీణాజార్జ్ విచారణకు ఆదేశించారు.





