News

హిందూ యువకుడిని ప్రేమించిందని ఇద్ద‌ర్నీ చంపేశారు…

434views
  • ముస్లిం మూక దారుణ చ‌ర్య‌

  • యువ‌తి తండ్రే ప్ర‌ధాన నిందితుడు

బస్తీ: పరువు హత్యకు మరో ప్రేమ జంట బలైంది. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలోని పదారియా చేట్‌సింగ్‌ గ్రామంలో ఈ దారుణం జరిగింది. వేరే మతం వ్యక్తిని ఇష్టపడిందని అమ్మాయి కుటుంబ సభ్యులే ఈ జంటను హతమార్చారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ముజిబుల్లా వద్ద ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేసే 18 ఏళ్ళ దళిత యువకుడు అంకిత్‌.. ముజిబుల్లా కూతురు అమీనాను ప్రేమించాడు. ప్రేమ వ్యవహారం ఇష్టంలేని అమీనా తండ్రి ముజిబుల్లా కూతురిని వారించాడు. ఎంతకీ వినకపోవడంతో అంకిత్‌ను, అమీనాను హతమార్చారు. రుధౌలీ ప్రాంతంలోని చెరకు తోటలో అమీనాను పాతిపెట్టారు. అంకిత్‌ మృతదేహాన్ని గుర్తించిన పరాస్‌నాథ్‌ చౌదరి పోలీసులకు సమాచారమిచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి