News

హిందూ వ్యతిరేక విగ్రహాలను తొల‌గించ‌మంటే అరెస్టు చేశారు…!

422views
  • డీఎంకె ప్రభుత్వ వైఖ‌రిపై మండిప‌డుతున్న హిందువులు

శ్రీరంగం: దేవాలయాల ముందు ఉద్దేశపూర్వకంగా ఉంచిన పెరియార్ విగ్రహాలను తొలగించాలని పిలుపునిచ్చిన హిందూ కార్యకర్త కనల్ కణ్ణన్‌ను డీఎంకె ప్రభుత్వం అరెస్టు చేసింది. ఈ సంద‌ర్భంగా క‌ణ్ణ‌న్ స్పందిస్తూ.. శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం ముందు ఉన్న పెరియార్ విగ్రహాన్ని ప‌గ‌లిగొట్టిన రోజు మాత్రమే హిందువుల తిరుగుబాటు దినం అవుతుందని అన్నారు.

హిందూ మున్నాని అనే ప్రముఖ తమిళ హిందూ సంస్థ జూలైలో హిందూ హక్కుల గురించి అవగాహన కల్పించేందుకు నెల రోజుల పాటు యాత్ర నిర్వహించింది. యాత్ర ముగింపు కార్యక్రమంలో, కోలీవుడ్‌లో ప్రసిద్ధ స్టంట్ డైరెక్టర్, హిందూ మున్నాని ఆర్ట్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు కనల్ కన్నన్, దేవాలయాల ముందు ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేసిన పెరియార్ రామసామి (EVR) విగ్రహాల గురించి మాట్లాడారు.

శ్రీ రంగనాథ స్వామిని ఆరాధించేందుకు రోజుకు దాదాపు లక్ష మంది భక్తులు వస్తుంటారు. కానీ వారు బయటకు వచ్చినప్పుడు, వారిని స్వాగతిస్తూ “దేవుడు లేడు” అని చెప్పిన వ్యక్తి విగ్రహం ఉంది. అది విచ్ఛిన్నమైన రోజు మాత్రమే నిజమైన హిందూ తిరుగుబాటు జరిగే రోజు అవుతుంది” అని మాట్లాడారు.

అతని ప్రసంగం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయింది. దీంతో ఆయ‌న పెరియారిస్టుల దృష్టిలో ప‌డ్డారు. తంథై పెరియార్ ద్రావిడర్ కజగం నుండి అందిన ఫిర్యాదు ఆధారంగా అతనిపై కేసు నమోదు అయింది.

అతను ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ అది తిరస్కరించబడింది. అతడిని అరెస్టు చేసి ఈ నెల 26 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హిందూ మున్నాని రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది.

ద్రవిడ భావజాలానికి వ్యతిరేకంగా విమర్శలు చేసేవారిని, మాట్లాడేవారిని ఇలాంటి బెదిరింపు పద్ధతుల ద్వారా అణిచివేసేందుకు డీఎంకే ప్రభుత్వం ప్రయత్నిస్తోంద‌న్న విమ‌ర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతకుముందు, యూట్యూబర్‌లు కార్తీక్ గోపీనాథ్, మరిదాస్, కిషోర్ కె.స్వామి, సీతయిన్ మైంతన్ అకా దక్షిణామూర్తి, సత్తై దురై మురుగన్, ఇంకా చాలా మంది ద్రావిడ సిద్ధాంతం, ద్రావిడ మోడల్ పాలనను విమర్శించినందుకు జైలు శిక్ష అనుభవించార‌ని ఈ సంద‌ర్భంగా స్థానికులు గుర్తు చేశారు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి