News

ఆనందమఠ్‌ నవల ఆధారంగా వందేమాతరం గీతంపై భారీ చిత్రం

485views

ముంబై: ప్రముఖ బెంగాళీ రచయిత బంకించంద్ర ఛటర్జీ రచించిన నవల ఆనందమఠ్‌ అనే నవల రచించిన వందేమాతర గీతాన్ని మన జాతీయ గేయంగా మనం స్వీకరించాం. ఆ పాట రాసి 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా దానికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను నిర్మాతలు శైలేంద్ర కుమార్‌, సుజరు కుట్టి, కృష్ణ కుమార్‌.బి, సూరజ్‌ శర్మ విడుదల చేశారు.

భారత స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా నిర్మాతలు తమ ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్‌ 1770ని ప్రకటించారు. ఎస్‌ఎస్‌ -1 ఎంటర్‌టైన్‌మెంట్‌, పికె ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై బాహుబభాషా చిత్రంగా ఈ సినిమాను బకించంద్ర ఛటర్జీ రాసిన ఆనంద్‌ మఠ్‌ అనే నవలను ఆధారంగా చేసుకుని రూపొందించబోతున్నారు. అశ్విన్‌ గంగరాజు ఈ సినిమాను డైరెక్ట్‌ చేయబోతున్నారు. 2021లో విడుదలై ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘ఆకాశవాణి’ సినిమాతో అశ్విన్‌ గంగరాజు దర్శకుడిగా పరిచయమయ్యారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి