
111views
విజయవాడ: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శుక్రవారం వాడవాడలా ఘనంగా జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లోని ఆలయాల్లో వేడుకల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడు రోజుల పాటు వైభవంగా సాగే వేడుకలకు ఇస్కాన్ మందిరాలు సర్వాంగ సుందరంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. విశ్వశాంతి యజ్ఞంతో గురువారం వేడుకలను అట్టహాసంగా ప్రారంభించారు. ఉదయం నుంచే ఇస్కాన్ మందిరం భక్తులతో కిటకిటలాడింది. రాధా కృష్ణుల వేషధారణలో చిన్నారులు అలరించారు.