News

భద్రాచలం ఈవో నిర్వాకం… ఉపాలయం మూత

137views

భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఈవో శివాజీ చేసిన తప్పిదంతో ఉపాలయానికి తాళం వేయాల్సి వచ్చింది. రామాలయ ఈవో శివాజీ అంతరాలయంలో మూలమూర్తుల దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీ అభయాంజనేయస్వామి ఆలయంలో స్వామి దర్శనానికి వెళ్ళారు. అక్కడి అర్చకులు గోత్ర నామాలను నివేదిస్తున్న సమయాన ఈవో శివాజీ అక్కడే ఉన్న శఠగోపంతో స్వయంగా ఆశీర్వచనం తీసుకున్నారు.

దీన్ని గమనించిన అర్చకులు వైదిక కమిటీ దృష్టికి తీసుకెళ్ళ‌గా వెంటనే ఆలయానికి తాళం వేసి దర్శనాలను నిలిపివేశారు. అనంతరం యాగశాలలో శఠగోపానికి సంప్రోక్షణ, ఇతర పూజలు చేసి దర్శనాలు ప్రారంభించారు. ఈ అంశంపై ఈవో శివాజీని వివరణ కోరగా ఈ నిబంధన తనకు తెలియక ఏమరుపాటుగా శఠగోపాన్ని తాకానని చెప్పారు. వైదిక కమిటీ సూచన మేరకు సంప్రోక్షణ నిర్వహించినట్టు ఆయన వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి