News

నేపాల్ క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ గా భారత ఆల్రౌండర్ మనోజ్‌ ప్రభాకర్

108views

భారత క్రికెట్‌ జట్టు మాజీ ఆల్‌రౌండర్‌ మనోజ్‌ ప్రభాకర్‌ నేపాల్‌ జాతీయ జట్టుకు హెడ్‌ కోచ్ ‌గా నియమితుడయ్యాడు. భారత జట్టు తరఫున 1984 నుంచి 1996 మధ్య కాలంలో 39 టెస్టులు, 130 వన్డేలు ఆడిన ప్రభాకర్‌ గతంలో ఢిల్లీ, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌ రంజీ జట్లకు కోచ్ ‌గా పనిచేశాడు. 2016లో అఫ్గానిస్తాన్‌ జట్టుకు బౌలింగ్‌ కోచ్ ‌గా సేవలు అందించాడు. నేపాల్‌లో ప్రతిభావంతులైన క్రికెటర్లు ఎందరో ఉన్నారని.. తన శిక్షణతో వారిని ఉన్నతస్థితికి తీసుకెళ్తానని ప్రభాకర్‌ అన్నాడు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.