News

ముస్లిం సంస్థల నిరసనలు… కేరళ ఐఏఎస్ అధికారికి స్థానచలనం!

519views

తిరువ‌నంత‌పురం: కేరళ సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వాన్ని తమ భారీ వీధి నిరసనలతో ముస్లింలు బెదిరించారు. అలప్పుజా కలెక్టర్ శ్రీరాం వెంకితారామన్‌ను అతని అధికారిక పదవి నుండి తొలగించాల‌ని వివిధ ముస్లిం సంస్థలు నిర‌స‌న‌లు వ్య‌క్తం చేశాయి. ఈ ఆందోళ‌న‌ల‌కు త‌లొగ్గిన అక్క‌డి ప్ర‌భుత్వం అలానే చేసింది. కేరళ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్‌గా ఆయన తాజాగా నియమించింది.

వివ‌రాలివి…

2019 ఆగస్టులో తిరువనంతపురంలోని ఎంజీ రోడ్డులో జ‌రిగిన ఒక ప్ర‌మాదంలో జర్నలిస్టు కేఎం బషీర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘ‌ట‌న‌లో శ్రీరాం సహ నిందితుడు. ఆల్ ఇండియా సున్నీ జమియతుల్ ఉలమాకు చెందిన సిరాజ్ అనే వార్తాపత్రికలో బషీర్ పనిచేసేవాడు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే బెయిల్ కింద విడుదల చేశారు. ఈ కేసు విచారణకు ఇంకా కోర్టుకు చేరాల్సి ఉంది.

ఆ అధికారి హిందువు అయినందుకే ఈ నిర‌స‌న‌లు!

అనుకోకుండా రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించ‌డం, ఆ దుర్ఘ‌ట‌న‌లో జ‌ర్న‌లిస్ట్ మృతి చెంద‌డం విషాద‌క‌ర‌మే. అయితే, ప్ర‌మాదానికి కార‌కుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న వ్య‌క్తి హిందువు కావ‌డం, బ‌లైన వాడు ముస్లిం కావ‌డంతోనే ముస్లింలు త‌మ స‌మిష్టి బ‌లాన్ని ప్ర‌ద‌ర్శించాయ‌ని స్థానికులు విమ‌ర్శిస్తున్నారు. కేసు కూడా ఇంకా కోర్టుకు చేరాల్సి ఉన్న‌ప్ప‌టికీ ఆ ముస్లింలు సంస్థ‌లు ఇవేవీ ప‌ట్టించుకోకుండా త‌మ వైఖ‌రి ప్ర‌ద‌ర్శించ‌డం, అందుకు పాల‌కులు త‌లొగ్గ‌డం విచార‌క‌ర‌మంటున్నారు.

11 రోజుల క్రితం శ్రీరాం అలప్పుజా కలెక్టర్‌గా నియమితులైనప్పటి నుండి ముస్లిం సమాజం అసంతృప్తి వ్య‌క్తం చేస్తోంది. జిల్లా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌గా ఉన్న శ్రీరాంను కలెక్టర్ పదవి నుండి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ బ్యానర్‌లతో వేలాది మంది ముస్లింలు ఒకదాని తర్వాత ఒకటిగా వీధి నిరసనలు చేపట్టారు.

ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అధికారాలను కలిగి ఉన్న శ్రీ‌రాం ముస్లిం సమాజం మనోభావాలను అపహాస్యం చేస్తున్నాడని నిరసనకారులు ఆరోపించారు. 2017లో మున్నార్ అటవీ ప్రాంతాల్లో రాడికల్ క్రిస్టియన్ సంస్థలు నాటిన పెద్ద శిలువల వంటి అక్రమ ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకున్నందుకు ప్రశంసలు అందుకున్న అదే ఐఏఎస్ అధికారి ఈ వెంకటరామన్ కావడం గమనార్హం.

క్రైస్తవ సంఘాల ఒత్తిడికి తలొగ్గిన సీఎం పినరయి విజయన్ అప్పట్లో ఐఏఎస్ అధికారిని విమర్శించగా, సీపీఎం ‘ఆర్‌ఎస్‌ఎస్ ఏజెంట్’గా ముద్ర వేసింది. ఇలాంటి రాడికల్ మత సంస్థల చేతుల్లో ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం కేవలం కీలుబొమ్మలా మారిందని రాజకీయ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మతోన్మాద సంస్థల సామూహిక బేరసారాలు సివిల్ సర్వీసెస్‌లో అత్యున్నత అధికారుల పోస్టింగ్‌ను కూడా ప్రభావితం చేయడం ప్రారంభించడంతో, మతపరమైన ట్యాగ్ మాత్రమే రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుందా అని ఇతర సంఘాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి