News

94 యూ ట్యూబ్ చానళ్ళ‌పై కేంద్రం ఉక్కుపాదం.. దేశంపై విష‌ప్ర‌చార ఫ‌లితం!

418views

న్యూఢిల్లీ: దేశం గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న 94 యూట్యూబ్‌ చానళ్ళు, 19 సామాజిక మాధ్యమ అకౌంట్లను మూసివేసినట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ చెప్పారు.

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం–2000లోని సెక్షన్‌ 69ఏ ప్రకారం ఈ మేరకు చర్య తీసుకున్నట్టు ఆయన ప్రకటించారు. కొవిడ్‌కు సంబంధించి వ్యాపింపజేసే తప్పుడు సమాచారాన్ని కనిపెట్టేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్‌ కోవిడ్‌కు సంబంధించిన, చర్యలు తీసుకోదగ్గ 34,125 ప్రశ్నలకు స్పందించిందన్నారు.

ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో తన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారంలలో నకిలీ వార్తలకు సంబంధించిన 875 పోస్ట్‌లను తొలగించిందని ఠాకూర్‌ తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి