
376views
న్యూఢిల్లీ: దేశంలో మొత్తం 21 అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్టు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. కార్బన్ ఉద్గారాలను అరికట్టి పర్యావరణాన్ని పరిరక్షించే చర్యలలో భాగంగా 2030 నాటికి భారత్ 500 గిగావాట్ల శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని సమకూర్చుకుంటుందని గ్లాస్కోలో జరిగిన కాప్26 సదస్సులో ప్రధాన మంత్రి పేర్కొన్నారు. తద్వారా దేశ ఇంధన అవసరాలలో 50 శాతం మేర పునరుత్పాదక ఇంధనం ద్వారా పొందేలా అణు విద్యుత్ ఉత్పాదనపై దృష్టి సారించినట్టు తెలిపారు.





