
316views
-
మొదటి స్థానంలో నిలిచిన భారత్
న్యూఢిల్లీ: షూటింగ్ ప్రపంచ కప్ 2022లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. పోటీ చివరి రోజు భారత్ ఖాతాలో 14వ పతకం చేరింది. భారత్ ఐదు స్వర్ణాలు, ఆరు రజతాలు, నాలుగు కాంస్య పతకాలు సాధించి మొత్తం 15 పతకాలతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. పోటీ చివరి రోజు పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో అనీష్ భన్వాలా, విజయవీర్ సిద్ధూ, సమీర్‌లతో కూడిన భారత త్రయం రజతం సాధించింది. ఈ పోరులో అనీశ్-రిథమ్ జోడీ 16-12 పాయింట్లతో అనా దెడోవా-మార్టిన్ పొదరాస్కీ (చెక్ రిపబ్లిక్) జోడిపై విజయం సాధించింది. అనీశ్-రిథమ్ జోడికి రెండో ప్రపంచకప్ పతకం. ఈ ఏడాది కైరోలో జరిగిన ప్రపంచకప్ టోర్నీలో అనీశ్-రిథమ్ జోడీ స్వర్ణ పతకం సొంతం చేసుకుంది.





