
న్యూఢిల్లీ: అగ్నివీరుల నియామకంలో కేంద్రం కులానికి ప్రాధాన్యం ఇస్తోందని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. కులాలకు ప్రాధాన్యం ఇచ్చే ఆర్ఎస్ఎస్కు చెందిన ఈ ప్రభుత్వం ఇప్పుడు అగ్నిపథ్ నియామకాలను అదే విధంగా చేపడుతోందన్నారు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్. నాలుగేళ్ళ తర్వాత సైన్యంలోకి తీసుకునే 25 శాతం మందిలో అగ్రకులాలు, మతాల వారే ఉంటారని పేర్కొన్నారు.
సైన్యంలో రిజర్వేషనే లేనప్పుడు కాస్ట్ సర్టిఫికెట్ ఎందుకని ప్రశ్నించారు. అగ్నిపథ్ నియామకాల్లో కులం, మతానికి సంబంధించి ధ్రువపత్రం అడగడంపై ప్రతిపక్షాలు ఈ విధంగా స్పందించాయి.
ఈ విషయంపై స్పందించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్.. ఇవన్నీ పుకార్లే అని స్పష్టం చేశారు. ఈ సైనిక నియామక ప్రక్రియ దేశానికి స్వాతంత్ర్యానికి ముందు నుంచి కొనసాగుతోందని.. అందులో ఎలాంటి మార్పులు చేయలేదన్నారు. బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగారు.
నియామక ప్రక్రియపై వస్తున్న విమర్శలు సైన్యాన్ని అవమాన పరిచే విధంగా ఉన్నాయన్నారు. యువతను నిరసనలకు దిగేలా రెచ్చగొట్టేందుకు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.





