News

బావిలో పడ్డ గోమాతను ర‌క్షించిన చిన్నపల్లి గ్రామస్థులు

516views

ప‌రిగి: ప్రమాదవశాత్తూ పంట పొలాల్లోని వ్యవసాయ బావిలో పడిపోయిన ఆవును సురక్షితంగా బయటకు తీసిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. పరిగి మండలం చిన్నపల్లి గ్రామ సమీపంలోని ఓ బావిలో ఆవు పడిపోయింది. ఈ సంఘ‌ట‌న‌ను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారమిచ్చారు. హిందూపురం అగ్నిమాపక శాఖ సిబ్బంది బావిలో పడ్డ ఆవుని ఒక క్రేన్ సహాయంతో బయటకు తీశారు. గ్రామస్థులు కూడా అగ్నిమాపక సిబ్బందికి సహాయ సహకారాలు అందించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి