
418views
అమరావతి: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఆగస్టు 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ‘హర్ ఘర్ తిరంగా’ (ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరాలనే లక్ష్యంతో)కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై గురువారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ సమీక్షించారు.
ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ప్రవీణ్ కుమార్, రజత్ భార్గవ,ముఖ్య కార్యదర్శులు గోపాల కృష్ణ ద్వివేది,అనిల్ కుమార్ సింఘాల్, కార్యదర్శి జిఎస్ఆర్కెఆర్ విజయకుమార్, సెర్ప్ సిఇఒ ఇంతియాజ్ తదితర అధికారులు పాల్గొన్నారు. వీడియో లింక్ ద్వారా సమాచార శాఖ కమీషనర్ టి.విజయకుమార్ రెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.





