News

అత్యంత అరుదైన రక్త నమూనాను గుర్తించిన భార‌త‌ వైద్యులు

434views

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూపును భారత్‌లో పరిశోధకులు గుర్తించారు. గుజరాత్‌కు చెందిన 65 ఏళ్ళ వ్యక్తికి EMM నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నట్టు గుర్తించారు. ఇటువంటి అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ ప్రపంచంలో కేవలం 10మందికి మాత్రమే ఉంది. అటువంటి రక్తపు గ్రూపును కలిగిన పదో వ్యక్తిగా గుజరాత్‌లోని రాజ్ కోట్ వ్యక్తి రికార్డ్ సృష్టించాడు. భారత్‌లో ఈ బ్లడ్ గ్రూపు ఈయనకు మాత్రమే ఉంది. అయితే, సాధారణంగా ఏ, బీ, ఓ, ఏబీ ఇలా బ్లడ్ గ్రూపులు ఉంటాయని అందరికీ తెలిసిందే. వీటిలోనే EMM నెగిటివ్ చాలా ప్రత్యేకమైనది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి