News

భారత్ తేజస్ యుద్ధ విమానాల వైపే మలేసియా మొగ్గు

409views

న్యూఢిల్లీ: యుద్ధ విమానాల సరఫరాకు పలు దేశాలు ముందుకొస్తున్నప్పటికీ, భారత దేశపు ప్రతిష్ఠాత్మక తేజస్ యుద్ధ విమానాల వైపే మలేసియా మొగ్గుచూపుతోంది. తమ దేశ రక్షణలో ఫైటర్ శ్రేణులలో వీటిని కీలకంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నది. తేజస్ తేలికపాటి యుద్ధ విమానం శక్తి సామర్థాలతో ఈ ఆగ్నేయాసియా దేశం ఈ విమానాలను భారత్ నుంచి సమీకరించుకునే దిశలో చర్చలు చేపట్టింది.

ఉభయ దేశాల మధ్య సంప్రదింపులు కీలక దశకు చేరాయి. సుమారు 18 తేజస్‌లను సరఫరా చేసే ఒప్పందం తుది దశకు చేరుకుంది. ఇప్పటి వరకు తమ సైనిక బలగాలకు అందుబాటులో ఉన్న పాతకాలపు యుద్ధ విమానాల స్థానంలో ఈ తేజస్ ఫైటర్లను ప్రవేశపెట్టడం ద్వారా శక్తివంతం కావాలని మలేసియా యోచిస్తోంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి