విశాఖపట్నంలోని భారతీయ విద్యా కేంద్రం డిగ్రీ కళాశాలలో సామాజిక సమరసత వేదిక సాహిత్య విభాగం ఆధ్వర్యంలో శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ గారు రచించిన మాలపల్లి నవల విడుదలై నూరేళ్ళయిన సందర్భంగా ‘మాలపల్లి నూరేళ్ళ వేడుక’ పేరుతో సాహితీ సభ జరిగినది.
భారతీయ సాహిత్య పరిషత్ నగర అధ్యకులు డా. సూర్యారావు గారు అధ్యక్షులుగా, రచయిత, ప్రముఖ అంబేద్కరీయులు డా. గంటాన మోహనరావు ముఖ్య అతిథిగా, ప్రముఖ మానసిక వైద్యులు, భారతీయ సాహిత్య పరిషత్ ప్రాంత సంయోజకులు డా. విజయగోపాల్ గారు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న నవయుగాభారతి ప్రచురణల సంపాదకులు డాక్టర్ వడ్డి విజయసారథి గారు మాలపల్లి నవల యొక్క విశిష్టతను వివరించారు. అలాగే మాలపల్లి నవలా రచయిత శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ గారి కృషి నేటి సమాజానికి ఎలా ఉపయోగపడుతున్నదో కూడా తెలియజేశారు. మాలపల్లి నవల నేటి యువ రచయితలకు మార్గదర్శకంగా ఉంటుందని అందరూ తప్పక చదవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక సమరసత వేదిక సాహిత్య రాష్ట్ర కన్వీనర్ శ్రీ ఐనాడ దుర్గాప్రసాద్ మరియు ఇతర కవులు, రచయితలు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.