NewsProgramms

దేవాలయాలకు ధూప దీప నైవేద్య సామగ్రి వితరణ

327views

ర్మ సింధు ఆధ్యాత్మిక సేవాసమితి ఆధ్వర్యంలో, పూజ్య గురువులు, శ్రీ భువనేశ్వరి పీఠం పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి స్వామిజీ వారి ఆశీస్సులతో శ్రీ గుమ్మకొండ శేఖర్ రెడ్డి గారి సహకారంతో నెల్లూరు జిల్లాలోని కొన్ని దళిత ప్రాంతాలలో గల గ్రామదేవతలు, కుల దేవతల ఆలయాలకు ధూప దీప నైవేద్య సామాగ్రిని వితరణ చేశారు.

నెల్లూరు నగర పరిధిలోని దీనదయాళ్ నగర్ నాగ పోలేరమ్మ దేవాలయం, ఇందుకూరుపేట మండలం పల్లిపాడు అరుంధతివాడ మాతా పరమేశ్వరి ఆలయం, పల్లిపాడు హరిజన వాడ లోని పోలేరమ్మ తల్లి ఆలయం, నెల్లూరు నగర పరిధిలోని నారాయణరెడ్డి పేట, బీసీ కాలనీ పోలేరమ్మ తల్లి ఆలయం మొదలగు ఆలయాలకు ఈ ధూప దీప నైవేద్య సామగ్రిని అందజేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.