News

రాంగోపాల్‌ వర్మకు నోటీసులు ఇస్తాం: రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌

418views

అమ‌రావ‌తి: రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ముపై.. అభ్యంతరకర ట్వీట్‌ చేసిన దర్శకుడు రాంగోపాల్‌వర్మకు నోటీసు ఇస్తామని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. తొలి ఆదివాసీ మహిళా రాష్ట్రపతి అభ్యర్థిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ‘‘మానవ అక్రమ రవాణా’’పై దిల్లీలో జాతీయ మహిళా కమిషన్‌, బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ సంయుక్తంగా నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు.

వర్మ తన ట్వీట్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని వాసిరెడ్డి పద్మ సూచించారు. మహిళల భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళుతోందన్నారు. రాష్ట్రంలో చేపట్టిన కార్యచరణ ప్రణాళికను జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేఖాశర్మకు నివేదించినట్లు ఆమె తెలిపారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి