News

గుజరాత్ అల్లర్లలో మోడీకి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సమర్థించిన సుప్రీం కోర్టు

409views

న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 64 మందికి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) క్లీన్‌ చిట్‌ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు స్పెషల్ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్ ఆదేశాలను జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్‌ నేతృత్వంలోని ధర్మాసనం సమర్థించింది.

గుజరాత్ హైకోర్టు తీర్పును సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది. గుజరాత్ అల్లర్ల వేళ 2002 ఫిబ్రవరి 28 న అహ్మదాబాద్‌లోని గుల్బర్గ్‌ సొసైటీలో ప్రాణాలు కోల్పోయిన 68 మందిలో మాజీ ఎంపీ ఎహ్సాన్‌ జాఫ్రీ ఉన్నారు. ఈ కేసులో 64 మందికి క్లీన్‌చిట్‌ రాగా దాన్ని సవాల్ చేస్తూ ఎహ్సాన్‌ జాఫ్రీ భార్య జాకియా జాఫ్రీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

జాకియా జాఫ్రీ దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. 2021 డిసెంబర్ 9న ఈ తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. తాజాగా శుక్రవారం నాడు తీర్పును వెలువరించింది. సిట్​ నిర్ణయాన్ని సమర్థిస్తూ గుజరాత్ హైకోర్టు 2017లోనే ఈ కేసును కొట్టివేసింది. గుజరాత్​ హైకోర్టు ఆదేశాలను సైతం సుప్రీం సమర్థించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి